పాఠశాలలకు సెలవు ప్రకటించండి
1 min read_ ఏఐడీఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి వి. హరీష్ కుమార్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: జిల్లాలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించాలని ఏఐడీఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి వి. హరీష్ కుమార్ రెడ్డి విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతి రోజు 8వేల కేసులు నమోదవుతున్నాయని, ఇందులో విద్యార్థులే అధికంగా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదోని కేజీబీ స్కూల్లో 52 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ రాగా , దొర్నిపాడు మండలం అమ్మిరెడ్డి కేజీబీలో 35 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కలెక్టర్, విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఏయిడెడ్, కేజీబీ పాఠశాలల్లోని విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించాలని కోరారు. సమావేశంలో AIDSO జిల్లా ఇంచార్జీ పి. విశ్వనాథ్ రెడ్డి, మరియు ప్రియాంక, మనోహర్ పాల్గొన్నారు.