రైల్వే స్టేషన్లో ఇబ్బంది కలిగితే ఈ నెంబర్ కు ఫోన్ చేయండి !
1 min read

పల్లెవెలుగువెబ్ : రైల్వే ప్రయాణికులు 139 టోల్ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించుకోవాలని రైల్వే సలహా కమిటీ సూచించింది. రైల్వే పోలీసుల ప్రవర్తనపై సలహా కమిటీ సమావేశం జరిగింది. విశాఖపట్నంలో జరిగిన సమావేశం వివరాలను ఈస్ట్ కోస్ట్ రైల్వే అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ సంజయ్ వర్మ మీడియాకు ఒక ప్రకటనలో తెలియజేశారు. రైల్వే ప్రయాణికులకు అవసరమైన సమాచారం, ఫిర్యాదులు, సహకారం కోసం 139 ఉపయోగపడుతుందన్నారు.

