‘నృత్యాంజలి’తో… భారతీయ సంస్కృతిని స్మరించుకుందాం..
1 min readమలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ చైర్మన్ ఎం.పి. అహమ్మద్
పల్లెవెలుగు వెబ్: భారతీయ సాంప్రదాయ నృత్యరూపాలను స్వచ్ఛమైన బంగారంపై చెక్కి ‘నృత్యాంజలి’ పేరుతో అద్భుతమైన ఆభరణాలను విడుదల చేసింది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ. దేశ వాణిజ్యరంగంలో అతిపెద్ద బంగారు మరియు వజ్రాభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ… భారతీయ నృత్య రూపాలను సగౌరవంగా స్మరించుకుంటూ ఆదివారం కర్నూలు షోరూములో ‘నృత్యాంజలి’ పేరుతో విడుదల చేసింది. హస్తకళా ప్రావీణ్యంతో చెక్కబడిన ప్రతి ఆభరణం 100శాతం బీఐఎస్ హాల్మార్క్ చేయబడి స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడింది. ఉన్నతమైన సొగసు కోసం విలువైన రత్నాలు పొదగబడ్డాయి. శాస్ర్తీయ నృత్య రూపాల ఒంపులతో, రత్నాలతో ఆభరణాల ప్రపపంచంలో కొత్త కోణాలను ఆవిష్కరిస్తాయి. అనేక రకాల డిజైన్లతో కూడిన ఈ సేకరణలో నెక్లెస్, చెవిపోగు, ఉంగరాలు మరియు గాజులు తదితర ఆభరణాలు ‘నృత్యాంజలి’ ఇతి వృత్తాన్ని ప్రతిబింబిస్తాయని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆ సంస్థ చైర్మన్ ఎం.పి. అహమ్మద్ పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని మలబార్గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూముల్లో ‘నృత్యాంజలి’ పేరుతో ఆభరణాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కర్నూలు షోరూములో జరిగిన ‘ నృత్యాంజలి’ కార్యక్రమంలో స్టోర్ అసిస్టెంట్ హెడ్ చేతన్, మార్కెటింగ్ మేనేజర్ నూర్వుల్లా, స్టోర్ మేనేజర్ అజీష్ కుమార్, మన్సూర్; సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.