NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కుక్క అడ్డురావడంతో… బైక్ పై నుండి కింద పడి వ్యక్తి మృతి

1 min read

 పల్లెవెలుగు వెబ్, మిడుతూరు: మండలపరిధిలోని జలకనూరు గ్రామానికి చెందిన దేశం.శ్రీనివాసరెడ్డి(52) బైక్ నుండి కింద పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ జి.మారుతిశంకర్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి . ఆదివారం ఉదయం 7.30గంటల సమయంలో జలకనూరు గ్రామానికి చెందిన దేశం శ్రీనివాసరెడ్డి తన బంధువుల పెళ్లికి రేగడ గూడూరు గ్రామానికి బైకుపై బయలుదేరారు.జలకనూరు బాట దాటిన తర్వాత కుక్క అడ్డురావడంతో బైక్(AP21AW 2234)అదుపు తప్పి కింద పడడంతో తలకు బలమైన గాయం అయినది.అతనిని వెంటనే అంబులెన్స్ లో నందికొట్కూరు ఆస్పత్రికి తరలించారు.అక్కడ నుండి కర్నూలు గౌరీ గోపాల్ హాస్పిటల్ కి మెరుగైన చికిత్స కోసం అక్కడికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 10గం.మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.కుటుంబ యజమాని మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.మంచి వ్యక్తి చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మృతునికి భార్య దేశం రాజేశ్వరమ్మ,ఇద్దరు కూతుర్లు సుప్రజ(19), తనుజ(18)ఉన్నారు.ఇద్దరు కూతుళ్లు చదువుతున్నారని.మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

About Author