NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తల్లీ… ప్రజలను చల్లగా చూడండి : ఎమ్మెల్యే శ్రీకాంత్​ రెడ్డి

1 min read

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: చిన్నక్కమ్మ పెద్దక్కమ్మ ప్రజలను చల్లగా చూడండి తల్లీ అని కోరారు. సోమవారంసుండుపల్లి మండలం మడితాడు సమీపంలో  జరిగిన చిన్నక్కమ్మ, పెద్దక్కమ్మ వారి జాతర కార్యక్రమంలో పాల్గొని  వైఎస్ఆర్ సిపి అన్నమయ్య  జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ గడికోట శ్రీకాంత్ రెడ్డి , జెడ్ పి చైర్మన్ ఆకేపాటి అమరనాధ రెడ్డి లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి, అమరనాధ రెడ్డి లు మాట్లాడుతూ    అమ్మవార్ల దయతో ప్రజలు సభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.  జాతరను అత్యంత భక్తి శ్రద్దలతో ,వైభవోపేతంగా  నిర్వహించడం, ప్రజలలో భక్తి భావం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.జాతరకు విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డి, ఆకేపాటి అమరనాధ రెడ్డి లకు వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు బిఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించి దుస్సాలువలుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణమోహన్ రెడ్డి, శివారెడ్డి, రెడ్డెన్న,  ఆర్ ఎంపి శివారెడ్డి, చంద్రానాయక్, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుడు దిన్నెపాడు రవిరాజు,బిసి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్, సర్పంచ్ ఆంజనేయులు, రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

About Author