అమ్మ ఒడి.. పోస్టల్ బ్యాంక్ అకౌంట్ ఉన్నా ఓకే !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ విద్యాశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. అమ్మఒడి పథకం లబ్ధిని పొందేందుకు విద్యార్థుల తల్లులకు పోస్టల్ బ్యాంకు ఖాతాలున్నా సరిపోతుందని, అయితే అవి ఆధార్‌తో అనుసంధానం చేయించుకోవాలని స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతాలే కాకుండా పోస్టల్ బ్యాంకు ఖాతాలున్నా అమ్మఒడి ప్రయోజనం అందిస్తామని విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఒక మెమో విడుదల చేశారు.