అసైన్మెంట్ భూముల అమ్మకం పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
1 min readపల్లెవెలుగువెబ్ : అసైన్ మెంట్ భూముల పై ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించే భూములకు ఏపీ అసైన్‌మెంట్ చట్టం-1977 వర్తించదని రెవెన్యూశాఖ మరోసారి స్పష్టత ఇచ్చింది. అసైన్‌మెంట్ అయిన పదేళ్ల తర్వాత ఆ భూములను లబ్ధిదారులు అమ్ముకోవచ్చని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎలాంటి నిరభ్యంతర పత్రాలు(ఎన్‌ఓసీ) తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఈ మేరకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్ మార్గదర్శకాలు జారీ చేశారు.