మీలో కంటెంట్ ఉంటే.. డబ్బును ఇలా సంపాదించొచ్చు !
1 min readపల్లెవెలుగువెబ్ : పలు భాషల్లో కంటెంట్ అగ్రిగేటర్ సేవలు అందిస్తున్న రిసోర్సియో తెలుగు భాషలో కంటెంట్‌ను అందించే సేవలను ప్రారంభించింది. ఆంగ్లం, కన్నడ, తమిళం, తెలుగు తదితర ఎనిమిది భాషల్లో కంటెంట్ అగ్రిగేటర్‌గా పీపీటీలు, డాక్యుమెంట్లు, పీడీఎఫ్ ఫైల్స్, ఈ-బుక్స్, ఆడియోల రూపంలో కంటెంట్‌ను అందిస్తోంది. కంటెంట్ సృష్టికర్తలకు రిసోర్సియో ఒక ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తోంది. కంటెంట్ అందించే వారికి ఇదొక ఆన్‌లైన్ బజార్. కంటెంట్‌ను అప్‌లోడ్ చేసి నగదు ప్రయోజనం పొందవచ్చన్నారు. అకౌంటెన్సీ, వ్యవసాయం, ఆటలు వంటి 50 కేటగిరీల కంటెంట్‌ను అప్‌లోడ్ చేయొచ్చు. కాగా కార్యకలాపాల విస్తరణకు వచ్చే రెండేళ్లలో రూ.40 కోట్లను సమీకరించాలని చూస్తున్నట్లు తెలిపారు.