PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెక్స్‌ వ‌ర్క్ చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన‌దే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెక్స్‌ వర్క్‌ చట్టబద్ధమైన వృత్తేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గౌరవంతోపాటు, చట్టం కింద సమాన రక్షణ పొందడానికి సెక్స్‌ వర్కర్లు అర్హులేనని తెలిపింది. సెక్స్‌ వర్కర్ల హక్కులను పరిరక్షిస్తూ జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం 6 సూచనలు చేసింది.

  • చట్ట ప్రకారం సమాన రక్షణ పొందడానికి సెక్స్‌ వర్కర్లకు అర్హత ఉంది. సెక్స్‌ వర్కర్‌ మేజర్‌ అయి ఉండి, ఇష్టపూర్వకంగా వృత్తి నిర్వహిస్తున్నప్పుడు పోలీసులు జోక్యం చేసుకోకూడదు. వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోకూడదు. బ్రోతల్‌ హౌస్‌లో ఇష్టపూర్వకంగా జరిపే సెక్స్‌వర్క్‌ చట్టవ్యతిరేకమేమీ కాదు. అందువల్ల బ్రోతల్‌ హౌస్‌పై రైడ్‌ చేసినప్పుడు సెక్స్‌ వర్కర్ల అరెస్టులు, జరిమానా విధించడం, వేధించడం, ఇతరత్రా బలి చేయడం వంటివి కూడదు.
  • బ్రోతల్‌ హౌస్‌ను నడపడం మాత్రం చట్టవ్యతిరేకమే. తల్లి సెక్స్‌ వర్క్‌ చేస్తోందన్న కారణం చూపి బిడ్డను ఆమె నుంచి వేరు చేయకూడదు. బ్రోతల్‌ హౌస్‌లో సెక్స్‌ వర్కర్లతో మైనర్లు కలిసి జీవిస్తున్నంత మాత్రాన ఆ పిల్లలను అక్రమ రవాణా ద్వారా తీసుకొచ్చారని భావించడం తగదు.
  • సెక్స్‌ వర్కర్లు ఇచ్చే ఫిర్యాదులపై పోలీసులు వివక్ష చూపకూడదు. ముఖ్యంగా తమపై లైంగికపరమైన దాడి జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు మెడికో-లీగల్‌ రక్షణ సహా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల‌ని కోర్టు సూచించింది.

About Author