రాబోయే కాలంలో ధరలు పెరుగుతాయా ?
1 min readపల్లెవెలుగువెబ్ : భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేస్తోంది. పెరిగిన ముడిపదార్థాల ధరలు, రవాణా వ్యయాలు, గ్లోబల్ లాజిస్టిక్స్, సప్లయ్ చెయిన్ సంబంధిత సవాళ్ల కారణంగా అధునాతన పరిశ్రమల వ్యయాలు భారీగా పెరగనున్నాయి. ఫలితంగా అధిక టోకు ద్రవ్యోల్బణం ప్రభావం రిటైల్ ద్రవ్యోల్బణంపై పడొచ్చని ఆర్బీఐ విశ్లేషించింది. ఈ మేరకు శుక్రవారం వార్షిక నివేదికను విడుదల చేసింది. అధిక టోకు ద్రవ్యోల్బణం ఒత్తిడితో క్రమంగా ఆహార, నిత్యావసర, ఇతర అన్నిరకాల ధరలు పెరిగేందుకు అవకాశముందని హెచ్చరించింది.