దుకాణం తెరిచిన అమెజాన్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ‘అమెజాన్ స్టైల్’ పేరుతో అమెజాన్ సంస్థ వస్త్ర దుకాణం తెరిచింది. తొలుత కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నగరానికి సమీపంలోని గ్లెన్డేల్ ప్రాంతంలో అమెజాన్ స్టైల్
క్లాత్ స్టోర్‌ను అమెజాన్ ప్రారంభించింది. అమెజాన్ వెబ్సైట్లో దుస్తులు అందుబాటులో ఉన్నప్పటికీ పరిమిత బ్రాండ్స్ మాత్రమే ఉన్నాయి. ఎక్కువగా బ్రాండెడ్ టీ షర్ట్స్ వంటివి మాత్రమే అమెజాన్ వెబ్సైట్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ.. ఈ ‘అమెజాన్ స్టైల్ ` లో అలా కాదు. లాకోస్టే, లెవీస్, స్టీవ్ మాడెన్, టామీ హిల్ ఫిగర్, చాంపియన్ బ్రాండ్స్ దుస్తులు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.