వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా ?
1 min readపల్లెవెలుగువెబ్ : కాకినాడలో సుబ్రమణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ హత్య చేస్తే దాచి పెట్టే ప్రయత్నం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన తాము పోరాటం చేస్తే ఎమ్మెల్సీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారన్నారు. సీఎం బాబాయ్ వైఎస్ వివేకాను హత్య చేసిన ఎంపీ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరని ప్రశ్నించారు. గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చారని గుర్తు చేశారు. చిత్తశుద్ది ఉంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించాలన్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా..? అని చంద్రబాబు సవాల్ విసిరారు. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తోన్న సీబీఐపై బెదిరించారని చెప్పారు.