PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విమానం కూలిపోయింది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉద‌యం త‌ప్పిపోయిన తారా ఎయిర్ విమానం కూలిపోయింది. 22 మందితో ప్రయాణిస్తూ గల్లంతైన నేపాల్ తారా ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. పర్యాటక నగరమైన పోఖరా నుంచి ఈ ఉదయం 9.55 గంటలకు టేకాఫ్ అయిన విమానం 15 నిమిషాల తర్వాత కంట్రోల్ టవర్‌తో సంబంధాలు కోల్పోయింది. రెండు ఇంజిన్లు కలిగిన ఈ చిన్న విమానం మిస్సయిన వెంటనే సెర్చ్ ఆపరేషన్ కోసం రెండు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఈ విమాన శకలాలను కోవాంగ్ గ్రామంలో గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మనపతి హిమాల్‌ కొండచరియల కింద లాంచే నది ఒడ్డున విమానం కూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే నేపాల్ ఆర్మీ రోడ్డు, వాయు మార్గాల్లో ఘటనా స్థలానికి బయలుదేరినట్టు ఆర్మీ అధికార ప్రతినిధి నారాయణ్ సిల్వాల్ తెలిపారు.

                                 

About Author