మళ్లీ రోడ్ల పైకి అంబాసిడర్ కారు !
1 min readపల్లెవెలుగువెబ్ : హిందుస్తాన్ మోటార్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో చక్రం తిప్పేందుకు సిద్ధమైంది. అంబాసిడర్ ఎలక్ట్రిక్ కారుతో రీ ఎంట్రి అదిరిపోయేలా ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఈ సందర్భంగా హిందుస్తాన్ మోటార్స్ డైరెక్టర్ ఉత్తమ్ బోస్ “అప్పట్లో మా ఉద్యోగుల సంఖ్య 2,300 గా ఉండేది. ఇప్పుడు 300కి తగ్గింది. ప్రస్తుతం ఆర్ధిక సమస్యల నుంచి బయట పడ్డాం. ఇప్పుడు అంబాసిడర్ పేరుతో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయాలని అనుకున్నాం. ఇందుకోసం చైనీస్ ఈవీ సంస్థల్ని సంప్రదించాం. కానీ యూరోపియన్ కంపెనీలతో జతకట్టాలని నిర్ణయించుకున్నాం. రూ.600కోట్ల పెట్టుబడితో ఫ్రెంచ్ కార్ మేకర్ పుజోతో కలిసి అంబాసిడర్ ఎలక్ట్రిక్ కార్ తయారు చేయబోతున్నట్లు” ఉత్తమ్ బోస్ వెల్లడించారు.