విమాన ప్రమాదం.. ప్రయాణీకుల మృతదేహాలు ?
1 min readపల్లెవెలుగువెబ్ : నేపాల్ తారా ఎయిర్లైన్స్ విమాన ప్రమాదంలో శకలాలను సోమవారం ఉదయం గుర్తించారు. ప్రయాణికుల మృతదేహాలు కాలిపోయాయని, కొన్ని మృతదేహాలు అసలు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. నేపాల్ ఆర్మీ, రెస్క్యూ ట్రూప్స్తో కలిసి చేపట్టిన ఆపరేషన్ ఆదివారం సాయంత్రం మంచు వర్షం కారణంగా ఆపేశారు. అయితే ఈ ఉదయం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన కాసేపటికే మనపతీ హిమాల్ కొండచరియల దగ్గర శకలాలను గుర్తించారు. ముస్తాంగ్ జిల్లా కోవాంగ్ గ్రామ శివారులో ఈ తేలికపాటి విమానం ప్రమాదానికి గురైంది. నలుగురు భారతీయలతో పాటు మొత్తం 22 మంది ప్రయాణికులు ఈ విమానంలో ఉన్నట్లు నిర్ధారించారు. సోమవారం ఉదయం సానోస్వేర్ వద్ద తగలబడుతున్న శకలాలు కనిపించాయని అధికారులు వెల్లడించారు. చనిపోయిన వాళ్లలో నేపాలీలతో పాటు నలుగురు భారతీయులు ఒకే కుటుంబానికి చెందిన వాళ్లని, వాళ్ల స్వస్థలం మహారాష్ట్ర థానే అని పేర్కొన్నారు.