కాంగో ఫీవర్.. 19 మంది మృతి !
1 min readపల్లెవెలుగువెబ్ : కాంగో ఫీవర్ కేసులు పెరగడం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. జంతువుల నుంచి మనుషులకు సోకే కాంగో ఫీవర్ ఇరాక్‌లో కలకలం రేపుతోంది. కొత్త వైరస్ వ్యాప్తితో ఆ దేశ ప్రజలు వణికిపోతున్నారు. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటికే 19 మంది మృత్యువాత పడ్డట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. శరవేగంగా వ్యాపించడం, అంతర్గత, బహిర్గత రక్తస్రావానికి దారి తీయడం, విపరీతమైన జ్వరం దీని ముఖ్య లక్షణాలు. దీని బారిన పడ్డ ప్రతీ ఐదుగురిలో ఇద్దరి చొప్పున మరణిస్తున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. ఆఫ్రికా, ఆసియా, మధ్యతూర్పు ప్రాంతాల్లో ఎక్కువగానే కనిపించే కాంగో ఫీవర్ వైరస్ ఇరాక్ ప్రజలను అల్లకల్లోలం చేస్తోంది. ఇక, ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తిస్తుంది. అయితే, ఈ వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం మరింత టెన్షన్ పెడుతోంది.