టీడీపీకి షాక్ !
1 min readపల్లెవెలుగువెబ్ : టీడీపీ మహిళా నేత దివ్యవాణి పార్టీకి రాజీనామా చేసేశారు. టీడీపీలో అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న ఆమె.. మంగళవారం రాజీనామా చేశారు. తాను రాజీనామా చేస్తున్న విషయాన్ని ట్విట్టర్ వేదికగా దివ్యవాణి తెలియజేశారు. అసలు తానెందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయంపైన కూడా ఆమె క్లారిటీ ఇచ్చుకున్నారు. ‘ తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ పార్టీకీ రాజీనామా చేస్తున్నాను. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని ట్విట్టర్లో ఆమె రాసుకొచ్చారు.