PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ ధ‌ర త‌గ్గింపు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వరుస చార్జీల బాదుడుతో విలవిల్లాడిన కమర్షియల్‌ సిలిండర్‌ వినియోగదారులకు స్వల్ప ఊరట లభించింది. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.135 తగ్గించినట్లు బుధవారం చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఈ తగ్గింపు ధరలు జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు ఒక నోటిఫికేషన్‌లో తెలిపాయి. గత రెండు నెలలుగా వాణిజ్య సిలిండర్ ధరలను వరుసగా రెండుసార్లు పెంచిన తర్వాత తాజాగా ధర తగ్గించడం విశేషం. అయితే, గృహోపకరణాల గ్యాస్ సిలిండర్లలో ధరల సవరణను ప్రకటించలేదు.

                                         

About Author