క్రీడలతో మానసిక ఉల్లాసం: ఎస్‌ఐ రమణయ్య
1 min readపల్లెవెలుగు వెబ్, చాగలమర్రి: క్రీడలు శారీరక ధృఢత్వం తో పాటు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని ఎస్‌ఐ రమణయ్య అన్నారు. బుధవారం చాగలమర్రి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో తాలుకా స్థాయి సూపర్ – 7 క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు క్రీడలలో గెలుపు ఓటములు సహజమని, ఓడినవారు గెలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో మెలగాలన్నారు. అనంతరం నిర్వహకులు షాహిద్,జుబేర్,అబుబకర్ లు మాట్లాడతూ తాలుకా పరధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 32 జట్లు పాల్గొంటున్నాయన్నారు.కార్యక్రమములో పాఠశాల విద్యా కమిటి చైర్మన్ అబ్ధుల్లా, పాఠశాల హెచ్‌ఎమ్ కోటయ్య,పిడి దాదాపీర్,బహుమతుల దాతలు ముల్లా షాకీర్ (సీడ్స్ ఆర్గనైజర్ ),వసీంఅక్రం (ఎమ్‌బి ఎలక్ట్రానిక్స్ ),ముల్లా నూర్‌బాష (రియల్ ఎస్టేట్ ),మన్సూర్ (గోల్డ్ స్మిత్ ),ఆలంసాగారి హనీప్,అబ్దుల్ ఖాదర్, జిలేబి షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.