NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదల సంక్షేమమే.. ప్రభుత్వ లక్ష్యం ​: ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​

1 min read

పల్లెవెలుగు వెబ్​: కర్నూలు పట్టణం లో 01 వ వార్డులోని  సచివాలయం -02 పరిధిలో  గడపగడపకు మన ప్రభుత్వం  కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్  పర్యటించారు.  ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వివరాల ద్రువపత్రాలను  ఆయన ఈ సందర్భంగా ప్రజలకు అందజేశారు.  వివరాలతో వున్న ద్రువపత్రంను శాసనసభ్యులు హఫీజ్ ఖాన్  చదివి ఆ పథకాలు అందాయో లేదో అడిగి తెలుసుకుని జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.  అక్క చెల్లమ్మలు, అవ్వ తాతల మోములలో చిరునవ్వు చూడాలనే ఒకే ఒక్క ఆశయంతో అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్, వృద్ధాప్య పింఛన్లు, వితంతువు పింఛన్లు, ఒంటరి మహిళ పింఛన్లు, ఇలా వాళ్ల సంతోషం కొరకు, మహిళల కోసం డ్వాక్రా రుణాలు, రుణ మాఫీ ఇలా ఎన్నో పథకాలు అమలు చేసిన ఘనత సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డికే దక్కిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని  ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ కోరారు.

About Author