PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వృత్తి పన్నుకు వ్యతిరేకంగా.. న్యాయవాదుల నిరసన

1 min read

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి న్యాయవాది  ప్రభుత్వానికి వృత్తి పన్ను చెల్లించాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అఖిలభారత న్యాయవాదుల సంఘం అన్నమయ్య జిల్లా న్యాయవాదులు నిరసన తెలిపారు. బుధవారం ఉదయంఅన్నమయ్య జిల్లా కేంద్రంలోని రాయచోటి తాసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద  న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలభారత న్యాయవాదుల సమాఖ్య  కన్వీనర్ టి.  ఈశ్వర్, రాజ్ కుమార్ రాజు ఆనంద్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదులకు వృత్తిపన్ను విషయంలో ఎప్పటి నుంచో మినహాయింపు ఉందని సర్వీసు జాబితాలో ఉన్న న్యాయవాదులను కూడా వదలకుండా వృత్తి పన్ను కట్టాలంటూ రాష్ట్రంలో న్యాయవాదులు అందరికీ ప్రభుత్వం  నోటీసులు పంపించడం నదారుణమని విమర్శించారు. జగన్ ప్రభుత్వం  2019లో అధికారంలోకి రాగా 2018 నుంచి 2022 వరకు ప్రతి న్యాయవాది పది వేల రూపాయల చొప్పున వృత్తి పన్ను  కట్టి తీరాల్సిందేనని న్యాయవాదులకు నోటీసులు పంపిస్తున్న డాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు . జగన్ ప్రభుత్వం  ఓటు బ్యాంకు  కోసం ఉచితాలు ప్రవేశపెట్టిందని ఏ వర్గాన్ని కూడా వదలకుండా పీడించి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ అభివృద్ధి నిరోధక పద్ధతిలో కొనసాగుతూ ఉందని విమర్శించారు. ప్రభుత్వ పాలన పద్ధతులు ఇలాగే కొనసాగితే రాష్ట్రం అధోగతి పాలు అవుతుందని, ఈ అప్రజాస్వామిక విధానాలు వ్యతిరేకించని పక్షంలో భావితరాలు మనల్ని  క్షమించవని  న్యాయవాదులు పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చెన్నయ్య , ఖాదర్ భాష , నాగార్జున , నాగేశ్వరరావు ఆదిరెడ్డి నాయక్,  నాగరాజా ,రవి వెంకటరమణ, కళ్యాణ్ ,రామచంద్ర మహిళా న్యాయవాదులు ఖుష్ణుమా, వరలక్ష్మి ,  ఖైరు న భీ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

About Author