లాక్ డౌన్ భయంతో నష్టాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్: భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. ఉదయం 10 గంటల సమయంలో నిఫ్టీ- 376 పాయింట్ల నష్టంతో.. 14240 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టీ- 1400 పాయింట్లు నష్టపోయి.. 30500 వద్ద ట్రేడవుతోంది. కోవిడ్ కేసులు పెరుగుతన్న నేపథ్యంలో పాక్షిక లాక్ డౌన్ లు, వారాంతపు లాక్ డౌన్ లకు వివిధ రాష్ట్రాలు సమాయత్తం అవుతున్న వేళ ఇన్వెస్టర్లు భయాందోళన చెందుతున్నారు. దీంతో మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. లాక్ డౌన్ విధిస్తే ఆర్థిక కార్యకలాపాలు తగ్గి.. అవి కంపెనీల ఫలితాల మీద ప్రభావం చూపుతాయి. ఫలితంగా కంపెనీలు నష్టపోతాయి. ఒకవైపు భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నా.. అమెరికా మార్కెట్లు మాత్రం ఆల్ టైం హై వద్ద ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో మిశ్రమ కదలికలు ఉన్నాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. దేశీయంగా ఉన్న కరోన ఉదృతి మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీస్తోంది.