ఏపీలో లాక్ డౌన్ ?
1 min readపల్లెవెలుగు వెబ్: ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ విధించే అంశం మీద ఉన్నత స్థాయి సమావేశం సీఎం జగన్ ఆధ్వర్యంలో జరుగుతోంది. కరోన కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతున్ననేపథ్యంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. రేపు మధ్యహ్నంలోపు పూర్తీ స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పదో తరగతి పరీక్షల రద్దు, రాత్రి పూట కర్ప్యూ, ఇంటర్ పరీక్షల వాయిదాలాంటి ముఖ్యమైన అంశాల మీద జగన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకోనుంది. దేవాలయాలు, మసీదులు, చర్చీల్లో కోవిడ్ ఆంక్షలు కఠినంగా అముల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. స్కూళ్లకు కూడ సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే పలు విద్యార్థి సంఘాల నుంచి కూడ పాఠశాలలకు సెలవులు ప్రకటించాలనే డిమాండ్ వినిపిస్తోంది. వ్యాపారల విషయంలో కూడ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనే అంశం మీద స్పష్టత రానుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.