మాజీ ప్రధానికి కరోన
1 min readపల్లెవెలుగు వెబ్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోన సోకింది. వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొన్ని రోజులుగా కరోన లక్షణాలతో బాధపడుతుండటంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన క్వారంటైన్ లోకి వెళ్లారు. వైద్యులు సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎయిమ్స్ లోని ట్రామా కేర్ సెంటర్ లో చికిత్స పొందుతున్నారు.