సిమెంట్ గిరాకీ పెరగనుందా ?
1 min readపల్లెవెలుగువెబ్ : మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం చేయనున్న ఖర్చు, రియల్ ఎస్టేట్ రంగంలో గృహాలకు పెరుగుతున్న గిరాకీ.. సిమెంట్ పరిశ్రమకు సానుకూలంగా ఉండనున్నాయి. ఈ సానుకూల అంశాల నేపథ్యం లో 2022లో ఆటుపోట్లకు లోనైనప్పటికీ.. భవిష్యత్తు ఆశావహంగా ఉండగలదని సిమెంట్ కంపెనీలు భావిస్తున్నాయి. 2022లో ఇంధనం, బొగ్గు, ఇతర ముడి పదార్థాల ధరలు పరిశ్రమపై ప్రతికూల ప్రభావాన్ని చూపినప్పటికీ.. గృహ, మౌలిక సదుపాయాల రంగాలపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు సిమెంట్ పరిశ్రమ వృద్ధికి దోహదం చేయనుందని సాగర్ సిమెంట్స్ చైర్మన్ కే థను పిళ్లై తెలిపారు. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సమీప భవిష్యత్తులో కొత్త యూనిట్లు రావడంతో పాటు ఉన్న కంపెనీల కొనుగోళ్లు, విలీనాలకు సిమెంట్ కంపెనీలు ముందుకు రానున్నాయి. దేశ మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడంలో సిమెంట్ పరిశ్రమ కీలకపాత్ర పోషించనుందన్నారు.