PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో… ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి:DYFI

1 min read

పల్లెవెలుగు వెబ్​, నంద్యాల: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు డీవైఎఫ్​ఐ రాష్ట్ర అధ్యక్షులు రామన్న.  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25వేల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే భర్తీ చేయాలన్నారు . ఆదివారం నంద్యాల డీవైఎఫ్​ఐ జిల్లా కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు రామ్ నాయక్ అధ్యక్షతన కమిటీ సమావేశం నిర్వహించి.. కీలక నిర్ణయాలు తీసుకుంది.  అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల  సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ప్రతి యేటా డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పి మూడేళ్ల  అయినా దాని ఊసే ఎత్తడం లేదని , లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మి వేలాది రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. తక్షణమే డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సై, పోలీసులు కానిస్టేబుల్ పోస్టులు గత నాలుగేళ్లుగా భర్తీ చేయడం లేదని వేలాది మంది నిరుద్యోగులు పోలీసు కావాలన్నా కోరికను రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లారు అని విమర్శించారు. గ్రుప్ 1,2,3,4 సంబంధించిన రిక్రూట్మెంట్ లో తీవ్ర జాప్యం జరుగుతోందని అన్నారు. అనేక గందరగోళం సృష్టించి నిరుద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఖాళీ పోస్టులతో సంబంధం లేకుండా భర్తీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. గ్రుప్ 1, పరీక్షల్లో అభ్యర్థులు అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో నంద్యాల జిల్లాలో భారీ ప్రభుత్వరంగ పరిశ్రమల ఏర్పాటుకు డివైఎఫ్ఐ పోరాడుతుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మదు, జిల్లా ఉపాధ్యక్షులు శివ, జిల్లా నాయకులు రాజేష్, చిరు, తదితరులు పాల్గొన్నారు.

About Author