NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌రోన పాజిటివ్: బాధ‌తో ఆత్మహ‌త్య

1 min read

పల్లెవెలుగు వెబ్: క‌రోన సోకింద‌నే బాధ‌తో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహ‌త్య చేసుకున్న ఘ‌ట‌న తెలంగాణ‌లోని వ‌న‌ప‌ర్తి జిల్లా కొత్తకోట ప‌ట్టణంలో చోటు చేసుకుంది వ‌న‌ప‌ర్తి జ‌ల్లా దేవ‌ర‌క‌ద్ర మండ‌లం గోప‌న్ ప‌ల్లికి చెందిన కోట్ల ర‌ఘ‌ప‌తిరెడ్డి గ‌త నాలుగు రోజులుగా అనార్యోగంతో బాధ‌ప‌డుతున్నారు. వైద్య ప‌రీక్షలు చేయించ‌గా క‌రోన పాజిటివ్ అని తేలింది. అనంత‌రం ఇంటికి చేరుకున్న ర‌ఘుప‌తిరెడ్డి కొంత‌సేప‌టి త‌ర్వాత బ‌య‌టికి వెళ్లాడు. ఎంత‌సేప‌టి ఇంటికి రాక‌పోయే స‌రికి కుటుంబ‌స‌భ్యులు ఫోన్ చేశారు. ఫోన్ కూడ ఎత్తలేదు. దీంతో సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆచూకీ గుర్తించారు. కానీ అప్పటికే లుంగీతో చెట్టుకు ఉరేసుకున్నాడు. బంధువుల స‌మాచారం మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

About Author