నష్టాల్లో స్టాక్ మార్కెట్లు !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆర్బీఐ వడ్డీరేటు వార్తలు, ఉక్రెయిన్‌లో భూభాగాలను రష్యా ఆక్రమించుకోవచ్చనే వార్తల నేపథ్యం, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు వెరసి ఇన్వెస్టర్లలో ఆందోళనల రేకెత్తించాయి. ఫలితంగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ షేర్లలో అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, కన్సుమర్స్ గూడ్స్ విభాగంలో షేర్లు భారీగా నష్టపోయాయి. 11:30 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా నష్టపోయి 54923 వద్ద, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టంతో 16,360 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.