నుపుర్ వ్యాఖ్యల పై గల్ఫ్ దేశాల అసంతృప్తి !
1 min readపల్లెవెలుగువెబ్ : మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు గల్ఫ్ దేశాల్లో దుమారం రేపాయి. గల్ఫ్ దేశాలు భారత్కు అత్యంత కీలకమైనవి. గల్ఫ్ దేశాలు ఇప్పటి వరకూ ఎప్పుడూ భారత రాయబారులకు సమన్లు జారీ చేయలేదు. సాధారణంగా ఏ మిత్ర దేశం కూడా రాయబారులను పిలిపించి అసంతృప్తి వ్యక్తం చేయదు. కానీ, ఈసారి ఏకంగా నాలుగు దేశాలు సమన్లు జారీ చేశాయి. ఖతర్, కువైత్, ఒమాన్, ఇరాన్ దేశాలు భారత రాయబారులను పిలిచి అధికారికంగా తమ నిరసన వ్యక్తం చేశాయి. సౌదీ అరేబియా, యూఏఈతోపాటు ఆరు గల్ఫ్ దేశాల సహాయక మండలి నుపుర్ వ్యాఖ్యలను ఖండించింది. జోర్డాన్, మాల్దీవులు, ఇండోనేసియా కూడా ఖండించాయి.