లోకేష్ ను వీరశివా రెడ్డి కలవడం శుభ పరిణామం
1 min readటిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ..
పల్లెవెలుగు వెబ్, కమలాపురం: తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పార్టీ లోకి ఎవరు వచ్చినా మంచిదేనని కమలాపురం మాజీ శాసనసభ్యుడు వీర శివారెడ్డి తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నార లోకేష్ బాబు ను కలవడం శుభ పరిణామం ఆని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ అన్నారు కమలాపురం లో బుధవారం సాయంత్రం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ కి ఎవరి దయా దాక్షిణ్యాల మీద మనుగడ సాగించాల్సిన అవసరం లేదన్నారు పార్టీ కి నిజాయితి కార్యకర్తలే మూలస్తంభాలన్నారు కమలాపురం మాజీ శాసనసభ్యుడు గండ్లూరు వీర శివారెడ్డి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతానని ప్రకటించడం పార్టీ కి ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు 2024 అసెంబ్లీ ఎన్నికలలో కమాలాపురం నియోజక వర్గంలో తెలుగు దేశం పార్టీ జెండా ఎగిరి తెలుగు దేశం పార్టీ అభ్యర్థిని భారి మెజారిటీతో గెలిపించడానికి పార్టీ లో నిజాయితీగా ఉన్న ప్రతి కార్యకర్త స్వచ్చంద్ధంగా పనిచేయడానికి సిద్దంగా ఉన్నారన్నారు వీరశివారెడ్డి చేరికతో పార్టీ లో మరింత నూతనోత్తేజం వస్తుందన్నారు.