20లక్షల రివార్డు: లొంగిపోయిన మారన్న
1 min readపల్లెవెలుగు వెబ్: మావోయిస్టు పార్టీ కీలక సభ్యుడు మారన్న అలియాస్ జలంధర్ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. మారన్న మీద 20 లక్షల రివార్డు ఉంది. ఆ రివార్డు అతనికే ఇస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మావోయిస్టు పార్టీలో కొత్త రిక్రూట్మెంట్ జరగడంలేదని, ఏవోబీలో ఒత్తిడి పెరిగిందని మారన్న తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలు వల్ల ఆదివాసీలు మావోయిస్టు ఉద్యమం పట్ల ఆసక్తి చూపడంలేదని మారన్న తెలిపారు. ఫలితంగానే మావోయిస్టు పార్టీ క్రమేణా బలహీనపడుతోందని చెప్పారు. మారన్ అలియాస్ జలంధర్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొంపెల్లి. మారన్న పలు కీలక దాడుల్లో పాల్గొన్నారు. బలిమెల ఘటనత పాటు కలెక్టర్ విన్ని క్రిష్ణ కిడ్నాప్ లో కీలకంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ మావోయిస్టులు హింస వీడి ప్రజల్లోకి రావాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు పకడ్బందీగా నిర్వహించడం వల్ల మావోయిస్టుల పట్ల ఆదివాసీలు ఆకర్షితులు కావడంలేదని తెలిపారు.