NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆంజ‌నేయుడు ఇక్కడే పుట్టాడు..ఇదిగో ఆధారాలు..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: రామ‌భ‌క్తుడు ఆంజ‌నేయుడు పుట్టింది తిరుమ‌ల కొండ‌ల్లోనే అనే తేల్చేశారు తితిదే అధికారులు. హ‌నుమంతుడి జ‌న్మస్థలం మీద ప‌రిశోధ‌న‌లు జ‌రిపిన తితిదే బృందం… స‌ప్తగిరి కొండ‌ల్లోని అంజ‌నాద్రే హనుమంతుడి జ‌న్మస్థానం అని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సేక‌రించిన‌ట్టు సంస్కృత వ‌ర్శిటీ వీసీ ముర‌ళీధ‌ర శ‌ర్మ ప్రక‌టించారు. హ‌నుమంతుడి జ‌న్మస్థానం అన్వేష‌ణ‌కు ఒక క‌మిటీ ఏర్పాటు చేశామ‌ని, ఆ క‌మిటీ వివిధ ర‌కాలుగా ప‌రిశోధ‌న‌లు జ‌రిపి.. కీల‌క ఆధారాలు ల‌భించాక‌.. ఒక నిర్ణయానికి వ‌చ్చింద‌ని ఆయ‌న తెలిపారు. స‌ప్తగిరుల్లోని ఆకాశ‌గంగ స‌మీపంలోని అంజ‌నాద్రిలోనే హ‌నుమంతుడు జ‌న్మించిన‌ట్టు కీల‌క ఆధారాలు ల‌భించాయని ఆయ‌న తెలిపారు.

About Author