PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిథాలీ రాజ్ ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ మ‌హిళా క్రికెట‌ర్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించింది. 23 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్న మిథాలీరాజ్‌ 39 ఏళ్ల వయసుకు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. తాజాగా ఆమె ఆటకు రిటైర్మెంట్‌ ఇవ్వడంతో.. మిథాలీ పెళ్లి ఎందుకు చేసుకోలేదన్న ప్రస్తావన మరోసారి తెరమీదకు వచ్చింది. మిథాలీ 22 ఏళ్లు వయసులోనే ఆమె కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. క్రికెట్‌లో బిజీగా ఉన్న మిథాలీ ఎన్ని సంబంధాలు వచ్చినా రిజెక్ట్ చేసుకుంటూ వెళ్లింది. 27-30 ఏళ్లు వచ్చిన తర్వాత మిథాలీరాజ్ పెళ్లి గురించి ఆలోచించింది. అప్పుడు వచ్చిన సంబంధాల్లో చాలా మంది క్రికెట్‌ని వదిలేయాలని చెప్పడంతో.. అలాంటి వారు తనకు అవసరం లేదని ఇంట్లోవాళ్లతో చెప్పేసింది. అలా మిథాలీ క్రికెట్‌ కెరీర్‌ కోసం తన పర్సనల్ లైఫ్‌ని.. పెళ్లిని త్యాగం చేసింది.

                                    

About Author