NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

60 మంది కార్య‌క‌ర్త‌ల‌ను హ‌త్య చేశారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌ 60 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని, 4 వేల మందిపై కేసులు పెట్టారని, నలుగురు మాజీ మంత్రులు, ఆరుగురు నేతలను అరెస్టులు చేశారని టీడీపీ అధినేత చంద్ర‌బాబు మండిపడ్డారు. 60 మంది పార్టీ నేతలను కేసులతో వేధించే ప్రయత్నం చేశారన్నారు. మహిళలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై హత్యాకాండ సాగించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వైసీపీ ప్రభుత్వం వల్ల బడుగు వర్గాలకు చెందిన వారే 291 మంది చనిపోయారు.. వీళ్లా సామాజిక న్యాయం గురించి మాట్లాడేది. ఇలా ఆ వర్గం.. ఈ వర్గం అని లేకుండా అందర్ని ఇబ్బందులు పెట్టారు.. హత్యాకాండ సాగించారు. ఇక ప్రభుత్వ వైఫల్యాల వల్లే చాలా మంది ప్రాణాలు కొల్పోయిన పరిస్థితి. ఈ ప్రభుత్వానికి భయపడకుండా కట్టడి చేయాలి.. లేకుంటే భయమే ప్రజల్ని చంపేస్తుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు. కొత్త డీజీపీ వచ్చాక.. ఏపీలో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. నేరస్థుడు పరిపాలిస్తున్నారు కాబట్టి.. పోలీసులు నేరస్తులకు వంతపాడుతున్నారా..? పోలీసుల తీరు మారకుంటే.. మేమే మారుస్తాం.. ఏ విధంగా చేయాలో మాకు తెలుసు’’ అంటూ చంద్రబాబు ఘాటుగా స్పందించారు.

                                 

About Author