భారత రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ ?
1 min readపల్లెవెలుగువెబ్ : తెలంగాణ రాష్ట్ర సమితి త్వరలోనే భారత రాష్ట్ర సమితిగా మారబోతోందా? అన్న ప్రశ్నకు టీఆర్ఎస్ సమావేశం అవుననే సమాధానం చెబుతోంది. ఈ నెల 19లోగా జరుగనున్న టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో దీనిపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం ప్రకటించనున్నారని, అనంతరం జాతీయ రాజకీయాలపైన కేసీఆర్ పూర్తి స్థాయిలో దృష్టిపెట్టనున్నారని తెలుస్తోంది. ఈ భేటీలో కేసీఆర్.. దేశ రాజకీయ పరిస్థితులు, అందులో టీఆర్ఎస్ పోషించనున్న పాత్రపై విస్తృతంగా చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘‘ప్రస్తుతం దేశంలో పాలన ఒక లక్ష్యం లేకుండా ఉంది. దీంతో అశాంతి పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిద్దాం’’ అంటూ ప్రతిపాదనను సీఎం కేసీఆర్ సమావేశంలో పాల్గొన్నవారి ముందుకుతెచ్చారు.