అలాంటి ప్రకటనలకు అడ్డుకట్ట !
1 min readపల్లెవెలుగువెబ్ : వాణిజ్య ప్రకటనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించే యాడ్స్‌కు అడ్డుకట్టవేయడం లక్ష్యంగా నిబంధనలను కఠినతరం చేసింది. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన ఉత్పత్తులు, అలాగే ఉచిత ఆఫర్ల గురించి రూపొందించే యాడ్స్‌ను నిశితంగా పరిశీలించాకే అనుమతులివ్వాలని నిర్ణయించింది. అలాగే సరోగసీ(అద్దె గర్భం)పై యాడ్‌లను పూర్తిగా నిషేధించింది. చిన్నపిల్లల కోసం రూపొందించే యాడ్స్ విషయంలో కంపెనీలు జాగ్రత్తలు తీసుకోవాలి. గుర్తింపు పొందిన సంస్థల ద్వారా శాస్త్రీయంగా నిరూపితమైతే తప్ప… తమ ఉత్పత్తులు వాడితే పిల్లల్లో తెలివితేటలు, శారీరక సామర్థ్యం పెరుగుతాయంటూ యాడ్స్ తయారుచేయకూడదని మార్గదర్శకాల్లో పేర్కొంది.