టీడీపీ పథకాలకు పేరు మార్చి అమలు చేస్తున్నారు !
1 min read
పల్లెవెలుగువెబ్ : చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన పథకాలకే పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఫరూక్ అన్నారు. నంద్యాలలో 17 మంది వైసీపీ మంత్రులు కార్యక్రమం ఏర్పాటు చేస్తే 200 మంది కూడా లేకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఆళ్ళగడ్డలో టీడీపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీమంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ.. తన తండ్రి భూమా నాగిరెడ్డి కార్యకర్తలకోసం ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు.