ప్రవక్త బతికి ఉంటే.. ఉన్మాదుల పిచ్చి చూసి దిగ్భ్రాంతికి గురయ్యేవాడు !
1 min readపల్లెవెలుగువెబ్ : మహమ్మద్ ప్రవక్త పై బీజేపీ మాజీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలనేపథ్యంలో దేశంలోని పలు చోట్ల నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ స్పందించారు. ప్రవక్త ఈరోజు బతికి ఉంటే ముస్లిం మతోన్మాదుల పిచ్చితనం చూసి ఆశ్చర్యపోయేవారని వ్యాఖ్యానించారు. ”మహమ్మద్ ప్రవక్త బతికుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం ఉన్మాదుల పిచ్చితనం చూసి దిగ్భ్రాంతికి గురయ్యేవాడు” అని ఆ ట్వీట్లో తస్లీమా అన్నారు.