పదవి నా వెంట్రుకతో సమానం !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రంలో ఎస్సీలకు న్యాయం చేసేందుకు ఎలాంటి వారిపైనైనా పోరాటానికి సిద్ధం. ఈ పదవి నాకు వెంట్రుకతో సమానం. నన్ను కెలికితే ‘మరో అమలాపురం’ సృష్టిస్తా!’’ అని వైసీపీకి చెందిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 41సీని రద్దు చేయాలని పోరాడుతున్నట్టు తెలిపారు. ఈ పోరాటంలో తనకు ఎమ్మెల్యేలు, ఎంపీలు అడ్డు తగులుతున్నారని, ఎస్సీ కార్పొరేషన్ పదవి నుంచి తనను తప్పించాలని చూస్తున్నారని తెలిపారు. అయితే, తనకు ఈ పదవి దీంతో సమానమంటూ తల వెంట్రుకలను చూపించారు.