రెండేళ్లకే `హైరేంజ్ రికార్డ్ ` !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీలోని బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన శివాన్ష్ నాగ ఆదిత్య ఏ టూ జెడ్ వరకు క్రమబద్ధంగా ఆంగ్ల అక్షరాలు ఉచ్ఛరిస్తూ, అనుబంధ ఆంగ్ల పదాలు చెబుతూ హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఆదిత్య వయసు రెండు సంవత్సరాలు. వేటపాలెం గ్రామానికి చెందిన కసుమర్తి శ్రీనివాస్, సరిత దంపతుల కుమారుడైన ఆదిత్య చిన్న వయసులోనే ఆంగ్లపదాలు క్రమపద్ధతిలో పలకడం నేర్చుకున్నాడు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారికి బాలుడి ప్రతిభ తెలియపరుస్తూ వీడియోను 2021 ఫిబ్రవరిలో పంపించారు.