రష్యా -ఉక్రెయిన్.. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : రష్యా తెర తీసిన అకారణ యుద్ధానికి ముగింపు కనుచూపు మేరలో కన్పించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. తమ అందమైన దేశంలో జరిపిన ప్రతి హత్యాకాండకూ, దాడికీ పుతిన్ పశ్చాత్తాపపడేలా చేసి తీరతామన్నారు. ‘‘డోన్బాస్‌లో రోజుల వ్యవధిలో చేజిక్కించుకుంటానని ఫిబ్రవరిలో యుద్ధ ప్రారంభంలో రష్యా ఆశ పడింది. నాలుగు నెలలవుతున్నా అక్కడ పోరాటం సాగుతూనే ఉంది. అక్కడ రష్యా బలగాలను సమర్థంగా అడ్డుకుంటున్న మా సేనలను చూస్తే ఎంతో గర్వంగా ఉంది’’ అన్నారు. యుద్ధ లక్ష్యాలను త్వరగా సాధించలేమన్న వాస్తవాన్ని రష్యా అర్థం చేసుకుందని, అందుకే అక్టోబర్ దాకా పోరు కొనసాగించాలని నిర్ణయించుకుందని ఉక్రెయిన్ సైన్యం అంచనా వేస్తోంది. డోన్బాస్ చిక్కితే ముందుగానే ముగించొచ్చని భావిస్తోంది.