ఐపీఎల్ మీడియా హక్కుల కోసం.. వేలం `వెర్రి`!
1 min readపల్లెవెలుగువెబ్ : ఐపీఎల్ మీడియా హక్కులకు సంబంధించిన ఈ-వేలం జోరుగా సాగుతుంది. 2023-2027 కాలానికి గాను ముంబైలో బీసీసీఐ వేలం ప్రక్రియ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం ముంబై లో ఇ-వేలం ప్రారంభమైంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. ఐపీఎల్ మీడియా హక్కుల విలువ ఇప్పటికే రూ. 40 వేల కోట్లు దాటిందని తెలుస్తున్నది.
ఉపఖండంలో టీవీ హక్కులు.. ఆ తర్వాత డిజిటల్ హక్కుల విభాగాలకు వేర్వేరుగా వేలం నిర్వహిస్తున్నారు. టీవీ ప్రసారం హక్కుల కోసం ఒక్కో మ్యాచ్ కు రూ. 49 కోట్లు బేస్ ప్రైజ్ గా నిర్ణయించగా.. డిజిటల్ హక్కులు రూ. 33 కోట్లుగా నిర్ణయించారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం టీవీ ప్రసార హక్కుల వేలం రూ. 24 వేల కోట్లు చేరిందని.. డిజిటల్ హక్కులు రూ. 19 వేల కోట్లు దాటాయని తెలుస్తున్నది. మొత్తానికి ఇప్పటికే ఐపీఎల్ మీడియా హక్కుల విలువ రూ. 43 వేల కోట్లు దాటిందని సమాచారం.