రూ. 4.48 లక్షల కోట్ల విలువైన ఇళ్లు నిలిచిపోయాయి !
1 min readపల్లెవెలుగువెబ్ : హైదరాబాద్‌తో సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో స్థిరాస్తి పరిశ్రమ మళ్ళీ నీరసిస్తోంది. ఖర్చులు పెరిగిపోవడంతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడం బిల్డర్లకు కత్తిమీద సాములా మారింది. దీంతో 2014 లేదా అంతకు ముందు పునాది రాయి పడిన 4,79,940 నివా స గృహాలు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. వాటి నిర్మా ణం చెప్పుకోదగ్గ స్థాయిలో ఆలస్యమవుతోంది. రియల్టీ మార్కె ట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయం తెలిపింది. ఈ ఇళ్ల విలువ ఎంత లేదన్నా రూ.4.48 లక్షల కోట్ల వరకు ఉంటుందని పేర్కొంది. ఇలా ఆలస్యమైన ప్రాజెక్టుల్లో 36,830 గృహాలను మాత్రమే బిల్డర్లు ఈ సంవత్సరం జనవరి-మే మధ్య పూర్తి చేయగలిగారు.