ధరల పెరుగుదలలో తెలంగాణ నెంబర్ – 1 !
1 min read
పల్లెవెలుగువెబ్ : ధరల పెరుగుదలలో తెలంగాణ ప్రథమ స్థానం సాధించింది. ప్రజలకు నిత్యావసరమైన వస్తువుల ధరలు దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే ఎక్కువగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నిత్యావసరాల ధరలకు సంబంధించి 22 రాష్ట్రాల గణాంకాలను కేంద్రం సోమవారం ప్రకటించగా.. అందులో 9.45 శాతంతో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో 8.52 శాతంతో మహారాష్ట్ర, మూడోస్థానంలో 8.49 శాతంతో ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. కేవలం 4.82 శాతం ద్రవ్యోల్బణంతో కేరళ రాష్ట్రం చివరిస్థానం పొందింది.