మచిలీపట్నంలో ముస్లింల ర్యాలీ !
1 min readపల్లెవెలుగువెబ్ : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ముస్లిం సంఘాల ర్యాలీ జరిగింది. మహ్మద్ ప్రవక్త పై బీజేపీ నేత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ర్యాలీ జరిగింది. టీడీపీ నేత కొనకళ్ల నారాయణ రావు మాట్లాడుతూ.. అన్ని మతాల వారు సమానంగా మన దేశంలో జీవిస్తారని.. లౌకిక దేశంలో అన్మదమ్ముల్లా కలిసి ఉంటున్నామన్నారు. ఏ మతాన్ని కించ పరిచే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. ముస్లిం మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నవీన్ జిందాల్, నుపుర్ శర్మ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. వారిపై వెంటనే కేసులు నమోదు చేసి… ఈ తరహా వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా కట్టడి చేయాలని కొనకళ్ల నారాయణ రావు డిమాండ్ చేశారు.