రైతుల ఖాతాల్లో నగదు జమ .. సీకే పల్లి సభలో జగన్
1 min read
పల్లెవెలుగువెబ్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించారు. 2021 ఖరీఫ్‌లో వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగిన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో నగదు జమ చేశారు.