సహజీవనం.. పెళ్లి చేసుకున్నట్టే !
1 min readపల్లెవెలుగువెబ్ : సహజీవనంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లేనని, సహజీవన బంధాన్ని వివాహంగానే పరిగణిస్తామని సుప్రీం మంగళవారం పేర్కొంది. అంతే కాకుండా సహజీవనంలో కలిగే పిల్లలకు పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందని పేర్కొంది. 2009 లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం తాజాగా కొట్టే వేస్తూ ఈ తీర్పు వెలువరించింది. చాలా ఏళ్లపాటు పెళ్లికి సహజీవనానికి చట్టం ఒకే విధంగా లేదని సుప్రీం కోర్టు గుర్తు చేసింది.