పబ్జీ గేమ్ ఎలా అందుబాటులో ఉంది ?
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రభుత్వం నిషేధించిన పబ్జీ గేమ్ పిల్లలకు ఇంకా ఎలా అందుబాటులో ఉందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనికి కారణాలు ఏంటో తెలపాలని కోరింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు కమిషన్ లేఖ రాసింది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 16 ఏళ్ల బాలుడు… పబ్జీ గేమ్ ఆడనివ్వలేదని తల్లిని హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై మీడియాలో వచ్చిన వార్తలను ఎన్సీపీసీఆర్ పరిగణనలోకి తీసుకుంది. దేశ సమగ్రత, భద్రతా కారణాల రీత్యా పబ్జీతోపాటు మరికొన్ని మొబైల్ గేమ్ యాప్‌లను కేంద్రం 2020లో బ్లాక్ చేసింది. అయినా ఇవి మైనర్లకు ఎలా అందుబాటులోకి వస్తున్నాయో తెలపాలని ఐటీ శాఖను ఎన్సీపీసీఆర్ కోరింది.