‘తాటి ముంజ’ క్యాన్సర్ నివారిస్తుందా..?
1 min readపల్లెవెలుగు వెబ్: ఎండకాలం వచ్చిందంటే చాలు.. పిల్లలు పొలం గట్ల మీద తాటిచెట్టు దగ్గరకు వచ్చేస్తారు. తాటిముంజల్ని ఎప్పుడు కిందకి దించుతారా?. ఎప్పుడెప్పుడు తిందామా అని ఆత్రతగా చూస్తుంటారు. తాటిముంజలు వేసవి దాహాన్ని తీర్చడమే కాకుండా అనేక ఔషధ గుణాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. తాటిముంజలు దేవుడిచ్చిన వరం అంటారు డాక్టర్లు. కాన్సర్ నివారణలో, ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఇలా అనేక రకాలుగా ఉపయోగాలు ఉంటాయని డాక్టర్లు అంటున్నారు.
- తాటిముంజను పాలపొడితో కలిపి ముఖం మీద ఉన్న నల్లటి మచ్చలకు రాసుకుంటే.. ముఖం కాంతివంతంగా మారుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కాలిన గాయాలకు కూడ పాలపొడితో కూడిన తాటిముంజ మిశ్రమాన్ని పూస్తారు.
- శరీరంలో డీహైడ్రేషన్ సమస్య రాకుండా తాటిముంజలు ఉపయోగపడతాయి.
- తాటిముంజలో ఫైటోకెమికల్స్ ఉంటాయి. కనుక బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారించే శక్తి వీటిలోని ఫైటోకెమికల్స్ కు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు.
- జీర్ణకోశంలో జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది.
- గర్భవతులు వాంతుల నివారణకు లేత తాటి ముంజలను తింటారు. దాని వల్ల ప్రెగ్నెన్సీ మొదట్లో వచ్చే వాంతులు, వికారం తగ్గుతాయి.
- బరువు తగ్గడానికి కూడ తాటిముంజలు చాలా బాగా ఉపయోగపడతాయని డాక్టర్లు చెబుతున్నారు.