పుట్టగానే ఆధార్ !
1 min readపల్లెవెలుగువెబ్ : అప్పుడే పుట్టిన శిశువులకు కూడా తాత్కాలికంగా ఒక ఆధార్ నంబర్‌ను కేటాయించాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా భావిస్తోంది. ఆ తర్వాత ఐదేళ్ల వయసులో తొలిసారి బయోమెట్రిక్స్ తీసుకుంటారు. ప్రభుత్వ సిబ్బందే పిల్లల ఇళ్లకు వెళ్లి బయోమెట్రిక్స్ సేకరిస్తారు. అదే సమయంలో శాశ్వత ఆధార్ నంబరును కూడా కేటాయిస్తారు. అనంతరం 18 ఏళ్లు నిండి మేజర్ అయ్యాక మళ్లీ బయోమెట్రిక్ డేటాను ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆ వివరాలు శాశ్వతంగా రికార్డుల్లో ఉంటాయి. పిల్లలు పుట్టినప్పటి నుంచే సంబంధిత కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. సామాజిక భద్రతను కల్పించే పథకాల పరిధిలోకి ప్రతి ఒక్కరినీ తీసుకురావడం దీని ఉద్దేశం.